గూగుల్ తాజాగా భారత మార్కెట్లో ఫిట్‌బిట్ ఎయిర్ పేరుతో కొత్త స్క్రీన్‌లెస్ ఫిట్నెస్ ట్రాకర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.13,999 కాగా, ఆఫర్లతో రూ.12,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి బ్యాంకుల క్రెడిట్ కార్డు ఆఫర్లతో ధర మరింత తగ్గే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఫిట్‌బిట్ ఎయిర్‌లో ప్రత్యేకంగా డిస్ప్లే ఉండదు. వినియోగదారులు తమ ఆరోగ్యం, వ్యాయామం, నిద్రకు సంబంధించిన వివరాలను ఫోన్లోని గూగుల్ హెల్త్ యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఇందులో 24 గంటల హార్ట్‌రేట్ పర్యవేక్షణ, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, హార్ట్ రిథమ్, ఏఎఫ్ఐబీ హెచ్చరికలు, విశ్రాంతి సమయంలో హార్ట్‌రేట్, హార్ట్‌రేట్ వేరియబిలిటీ, నిద్ర దశల పర్యవేక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వారం రోజుల బ్యాటరీ
ఫిట్‌బిట్ ఎయిర్‌లో లిథియం-పాలిమర్ బ్యాటరీని ఉపయోగించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని గూగుల్ పేర్కొంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. ఈ పరికరం 50 మీటర్ల లోతు వరకు నీటి నిరోధకతను కలిగి ఉంది.
గూగుల్ హెల్త్ సబ్స్క్రిప్షన్
కొనుగోలుతో మూడు నెలల గూగుల్ హెల్త్ ప్రీమియం కూడా లభిస్తుంది. ఆ తర్వాత రూ.99 నెలవారీ లేదా రూ.999 వార్షిక చందాతో కొనసాగించవచ్చు. ఫిట్‌బిట్ ఎయిర్ నాలుగు రంగుల్లో లభిస్తుందిఆబ్సిడియన్, లావెండర్, బెర్రీ, ఫాగ్.
ప్రస్తుతం గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ అధికారికంగా భారత మార్కెట్లోకి వచ్చింది. అధికారిక కొనుగోలు కోసం గూగుల్ స్టోర్ ఫిట్‌బిట్ పేజీని చూడవచ్చు.











