దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కామారెడ్డి జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ డౌన్ డౌన్.. సీఈసీ రాజీనామా చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రఘు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ లు మాట్లాడుతూ, దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్, నాయకులు యం. విటల్, ఆవారి గంగారం, ఇ. శంకర్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.









