బీర్కూర్, 17 November
భిర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కస్తూర్బా పాఠశాలలో ఓటు హక్కు వినియోగం మరియు దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
పోటీలలో మనస్విని మొదటి బహుమతిని, వాణి శ్రీ రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు. విజేతలకు మెడల్, పెన్ను, ప్రశంసా పత్రాలను అందజేశారు. విజేతలకు లయన్స్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గీత మేడం, లయన్ జోన్ చైర్మన్ సితలె రమేష్, సీనియర్ లయన్ మాజీ జోన్ చైర్మన్ సంతోష్ కొట్టురీ, లయన్ సభ్యులు మేరు భరత్, సుధం నవీన్, గంధపు సాగర్ మరియు పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.



