అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కామారెడ్డి జిల్లా మండలం దామరంచ సర్పంచ్ బోయిని శంకర్ అన్నారు. మంగళవారం ఆయన ఐదు లక్షల వ్యయంతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, అర్హులందరికి రూ.5 లక్షల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని మాటిచ్చిందని, ప్రస్తుతం ఆ మాటను నిలబెట్టుకుంటోందని తెలిపారు. కేవలం మూడు నెలల్లోనే పనులన్నీ పూర్తి చేసి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సాంకేతికతతో ఫిల్లర్ రూఫింగ్ విధానంలో స్లాబ్ నిర్మాణంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని చెప్పారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. దామరంచ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సర్పంచ్ బోయిని శంకర్ మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. రూ.5 లక్షల వ్యయంతో, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సాంకేతికతతో ఇళ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని శంకర్, ఉపసర్పంచ్ ఇ.శంకర్, ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకుడు బాబన్న, బోయిని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.









