జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బీర్కూర్ గ్రామ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు పాల్గొని, గాంధీజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బీర్కూర్ గ్రామ సెంటర్ లోని గాంధీ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ, ఉప సర్పంచ్ పరమేష్ పంతులు పాల్గొని, గాంధీజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, గాంధీజీ ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






