మండల కేంద్రంలో వీబీజీ- రాంజీ పథకం కింద గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు సర్పంచ్ అరిగే ధర్మతేజ అధ్యక్షత వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి, ఉపాధి పనులపై చర్చించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అరిగే ధర్మతేజ సూచించారు.
ఉపాధి హామీని మెరుగుపరచడమే లక్ష్యమని సర్పంచ్ అరిగే ధర్మతేజ అన్నారు. గతంలో 100 రోజులుగా ఉన్న పనిని ఇప్పుడు 125 రోజులకు పెంచారని, దీనివల్ల ఉపాధి హామీ కింద కూలీలకు రోజుకు 308 రూపాయల వేతనం అందుతుందని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి 40 నిధులు వాడుకోవచ్చని, తద్వారా గ్రామాభివృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ కూలీలకు అండగా నిలిచి, పనులు సజావుగా కొనసాగేలా చూడటం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మెహబూబ్, సెక్రెటరీ గంగారం, ఉప సర్పంచ్ పరమేష్, సొసైటీ వైస్ చైర్మన్ యామారాములు, వార్డు సభ్యులు కాజా నవాజ్ ఖాన్, మహేష్, భాస్కర్, రఘు, మధు, ఆనంద్, హైమద్, శంకర్, అగ్రికల్చర్ ఏఈ మీనా, సొసైటీ సెక్రెటరీ జి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామస్తులలో మాజీ ఎంపీపీ రఘు, అవారి గంగారం, విట్టల్ సార్, బసవరాజ్ పటేల్, శశికాంత్, బాలకృష్ణ, కుర్రి కృష్ణ, శివ కుమార్ యాదవ్, యోగేష్, మెక్క రమేష్, ఓంకార్, అశోక్, గ్రామ యువకులు, గ్రామస్తులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.






