ఎల్నినో ప్రభావంతో వేసవి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలపై గ్రామపంచాయతీ కార్యాలయం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జగదీశ్వర్, సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యం జరిగిన ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామంని అన్ని కాలనీలు, ప్రకాష్ రావు క్యాంపు, వెంకటప్పయ్య క్యాంపులను సందర్శించి, తలెత్తే సమస్యలను గుర్తించారు. రాబోయే కాలం నీటి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నందున, సిబ్బందికి ప్రతిరోజూ చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు.
ఏఈ జగదీష్, సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ నీటిని వృధా చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రోజు విడిచి రోజు వస్తాయని తెలియజేశారు. బండ కింద ఉన్న మోటారు పైపులైన్లను పరిశీలించి, మరమ్మతులు చేసి, త్రాగునీటిని ఇతర ట్యాంకర్లకు అందించాలని సూచించారు. మున్ముందు నీటి ఇబ్బందులు మరింత అధికమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమం సెక్రెటరీ గంగారం, ఉపసర్పంచ్ పరమేశ్ పంతులు, వార్డు సభ్యులు మహేష్, రాహుల్, భాస్కర్, రఘు, మధు, నర్సోజి, ప్రశాంత్, హైమద్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

